తెలంగాణ

telangana

ETV Bharat / state

'గన్నీ'లకి అన్ని రంధ్రాలే.. బియ్యాన్ని తీసుకోమంటున్న ఎఫ్​సీఐ - hyderabad latest news

FCI refuses rice bags: భారత ఆహార సంస్థకు వస్తున్న బియ్యం బస్తాలు తిరస్కరణకు గురవుతున్నాయి. గన్నీ సంచులు నాసిరకంగా ఉంటున్నాయని.. గట్టిగా ఉండాల్సినవి గుడ్డపేలికల్లా ఉండటంతో రంధ్రాలు పడి బియ్యం బయటకు వస్తున్నాయని మిల్లర్ల నుంచి వచ్చే సరుకును ఎఫ్‌సీఐ తిప్పి పంపుతోంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 27, 2023, 5:00 PM IST

FCI refuses rice bags: గన్నీ సంచులు నాణ్యత లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా భారత ఆహార సంస్థ.. గిడ్డంగులకు వచ్చిన వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం బస్తాలు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇటీవల జనగామ, హనుమకొండ జిల్లాలకు సరఫరా చేసిన సంచుల్లో 90 శాతం నాణ్యంగా లేకపోవడంతో కాజీపేట ఎఫ్‌సీఐ అధికారులు తిప్పిపంపారు. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ నాసిరకం గన్నీ సంచులు దర్శనమిస్తుండటంతో అధికారులు, మిల్లర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది.

నాణ్యత లేమి... పౌర సరఫరాల శాఖ.. బియ్యం సేకరణకు వినియోగించే గన్నీ సంచులను జ్యూట్‌ సంచుల తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్‌ జ్యూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు నాణ్యతను పరీక్షించి ఈ కంపెనీలకు అనుమతించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి సంచులు వస్తాయి. మిల్లర్లకు అందించే గన్నీ సంచులు బరువు తక్కువగా ఉంటున్నాయి. దారాల మధ్య దూరం ఎక్కువగా ఉండి రంధ్రాలు కనిపిస్తున్నాయి. ఈ గన్నీ సంచులకు గంజి తక్కువగా పెట్టడం వల్ల నాసిరకంగా మారి కరుకుదనం పోయి బియ్యం నింపగానే సంచులు వదులుగా ఉండి రంధ్రాలు పడుతున్నాయి. సగటున ఒక్కో ఖాళీ గన్నీ సంచి బరువు 580 గ్రాముల ఉండాలి కానీ 20 గ్రాముల బరువు తక్కువగా ఉంటోంది.

భారత ఆహార సంస్థ గిడ్డంగుల వద్దకు లారీల్లో బియ్యం వచ్చినప్పుడు క్వాలిటీ కంట్రోల్‌ విభాగం కాంటా మీద తూకం వేసి తీసుకుంటుంది. ఇక్కడ ప్రతి బియ్యం బస్తాను స్కాన్‌ చేసి తీసుకుంటారు. ఈ స్కానింగ్‌లో బస్తాలకు రంధ్రాలు ఎక్కువగా ఉన్నట్లు బయటపడుతోంది. ఇలాంటి బస్తాలలో బియ్యం నింపినప్పుడు రంధ్రాల గుండా గింజలు బయటకు రావడంతో తిరస్కరిన్నారు.

రూ. కోట్లలో నష్టపోవాల్సి వస్తోంది...బియ్యం నింపడానికి ఉపయోగించే గన్నీ సంచులు నాసిరకంగా ఉన్నాయంటూ భారత ఆహార సంస్థ, కేంద్ర జ్యూట్ కమిషనర్‌కు లేఖ రాసింది. అప్పట్లో ఒక్కో గన్నీ సంచి బరువు 2015 సంవత్సరం వరకు 665 గ్రాములు ఉండేది. కానీ ఇప్పడు 580 గ్రాముల బరువుగల సంచులు పంపిణీ చేస్తున్నారు. దీంతో ఎఫ్‌సీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

మిల్లర్ల నుంచి బియ్యం తీసుకున్నది మొదలు..వివిధ దశల్లో బియ్యాన్ని రవాణా చేయాల్సి ఉంటుందని, గోదాముల్లోనూ నెలల తరబడి వాటిని భద్రపరచాలని, నాణ్యత లేని సంచుల్లో సరకు వస్తే వాటికి రంధ్రాలు పడి తాము కోట్ల రూపాయాలలో నష్టపోతామని స్పష్టం చేసింది. దీనిపై ఎఫ్‌సీఐ అధికారులపై మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గన్నీ సంచుల నాణ్యత ప్రమాణాలు పరిశీలించి ఆమోదముద్ర వేసేది సెంట్రల్‌ జ్యూట్‌ కార్పొరేషన్‌ వారేనని, తమది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ: సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్, బీజేపీలవి మాటలు తప్ప చేతలు ఉండవు: హరీశ్‌రావు

ABOUT THE AUTHOR

...view details