తెలంగాణ

telangana

ETV Bharat / state

'జోరుగా తెరాస సభ్యత్వ నమోదు' - mla padmarao goud latest news

సికింద్రాబాద్​లో తెరాస సభ్యత్వం జోరుగా కోనసాగుతోందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. మెట్టుగూడ డివిజన్​లో నిర్వహించిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇంటింటికి తిరిగి సభ్యత్వం నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

The event was organized by Mettuguda Division and was attended by Deputy Chairman Shri Thigulla Padmarao Goud
'జోరుగా తెరాస సభ్యత్వ నమోదు'

By

Published : Feb 25, 2021, 10:39 AM IST

సికింద్రాబాద్ పరిధిలో తెరాస సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతోందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. మెట్టుగూడ డివిజన్​లో బుధవారం తెరాస సభ్యత్వ నమోదులో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. డివిజన్​లోని కార్యకర్తలకు సభ్యత్వ రసీదును అందజేశారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం తెరాస పార్టీకి కంచు కోటగా నిలుస్తోందని పేర్కొన్న ఆయన.. సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:'మొతేరా' మైదానం పేరు మార్పుపై దుమారం

ABOUT THE AUTHOR

...view details