తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంబీఎస్​ జ్యూవెలర్స్​కు రూ.222కోట్ల జరిమానా విధించిన ఈడీ - తెలంగాణ వార్తలు

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అధికారులు ఎంబీఎస్ బంగారు ఆభరణాల దుకాణానికి భారీ జరిమానా విధించారు. ఎంబీఎస్ జ్యూవెల్లర్స్​పై రూ.222కోట్లు, దాని డైరెక్టర్ సుఖేశ్ గుప్తాకు రూ.22కోట్ల జరిమానా విధించారు.

ఎంబీఎస్​ జ్యూవెలర్స్​కు రూ.222కోట్ల జరిమానా విధించిన ఈడీ
ఎంబీఎస్​ జ్యూవెలర్స్​కు రూ.222కోట్ల జరిమానా విధించిన ఈడీ

By

Published : Nov 3, 2020, 3:14 PM IST

నిబంధనలకు విరుద్ధంగా హాంగ్​కాంగ్​కు వజ్రాలు ఎగుమతి చేసిన కేసులో ఎంబీఎస్​ జ్యూవెలర్స్​పై ఈడీ భారీ జరిమానా విధించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఎంబీఎస్​ జ్యూవెలర్స్​కు రూ.222కోట్లు, దాని డైరెక్టర్​ సుఖేశ్​ గుప్తాకు రూ.22కోట్లు జరిమానా విధించారు. సుఖేశ్ గుప్తాపై ఇదివరకే రూ.216 కోట్ల లావాదేవీల్లో కేసు నడుస్తోందని ఈడీ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి హాంగ్​కాంగ్​కు వజ్రాలు ఎగుమతి చేసిన కేసులోనూ నిందితుడిగా ఉన్నారని పేర్కొన్నారు.

2013లో హాంగ్​కాంగ్​కు చెందిన లింక్ ఫై లిమిటెడ్ కంపెనీకి రూ.220 కోట్లు విలువ చేసే వజ్రాలను విక్రయించానని.... దానికి సంబంధించిన సొమ్ము రావాల్సి ఉందని సుఖేశ్​ గుప్తా వెల్లడించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. లింక్ ఫై కంపెనీతో... సుఖేష్ గుప్తాకు గల సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి:ధ‍రణిలో ఆస్తుల వివరాల నమోదుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details