తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓఆర్‌ఆర్‌పై పోలీసు అకాడమీ డైరెక్టర్​ కారు బోల్తా.. గాయాలు - రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్​రావుకు స్వల్ప గాయాలు

బాహ్యవలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. . నార్సింగి వద్ద తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు కారు బోల్తా పడింది. అకాడమీ నుంచి ఇంటికి వెళ్తుండగా ఓఆర్‌ఆర్‌పై ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో శ్రీనివా​సరావు స్వల్పంగా గాయపడ్డారు.

రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్​ కారు బోల్తా
రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్​ కారు బోల్తా

By

Published : Jul 15, 2020, 10:23 PM IST

తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి బాహ్యవలయ రహదారిపై నుంచి ఇంటికి వెళ్తుండగా ఆయన కారు ఒక్కసారిగా బోల్తా పడింది. వర్షం కురవడం వల్ల కారు... ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు స్వల్పంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని.. స్వల్పంగా గాయపడినట్టు వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి :60 లక్షలతో రోడ్ల నిర్మాణానికి మేయర్​ శంకుస్థాపన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details