ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగుస్తుంది. పోటీలో ఎంత మంది ఉండేది నేటితో తేలిపోతుంది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి 96 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి బెజగం నాగరాజు తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం నామినేషన్ల సంఖ్య 95కు చేరుకుంది.
పట్టభద్రుల బరిలో నిలిచేది ఎవరో తేలేది ఇవాళే.. - ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో బరిలో నిలిచేదెవరో నేడు తేలనుంది. ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరిరోజు.. ఎంత మంది బరిలో ఉంటారో ఇవాళ తేలిపోతుంది.
పట్టభద్రుల బరిలో నిలిచేది ఎవరో తేలేది నేడే...
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 73 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయత్రం... ఎన్నికల కమీషన్ బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 17 తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఇదీ చూడండి:కొలువుల భర్తీపై మాటల యుద్ధం.. వేడెక్కిన పట్టభద్రుల పోరు