వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఎవరు భూములు కొన్నా ఆ వివరాలు ఆన్‌లైన్‌లోనే కనిపిస్తాయి. ఈ వానాకాలంలో 2021 జూన్ 10 వరకూ ధరణి పోర్టల్‌లో నమోదైన భూమి కమతాల రైతులందరికీ లబ్ధి అందాలి. ఈ నెల 15 నుంచి సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేయాలి. 12, 13 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం సెలవులు. ఇక 14వ తేదీ ఒక్కరోజులోనే రైతుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు, పరిశీలన పూర్తిచేసి 15న సొమ్ము జమ ప్రారంభించడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖాతాల నమోదు ఎప్పుడు?
గత జనవరి 1 నుంచి ఈ నెల 10 వరకూ 2.91 లక్షల మంది వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ధరణి పోర్టల్‌లో అధికారిక వివరాలున్నాయి. రెవెన్యూశాఖ వారి పేర్లను ఖాతాల్లో చేర్చి, సంబంధిత వివరాలను వ్యవసాయశాఖకు ఆన్‌లైన్‌లో పంపాలి. వీటిని రైతుబంధు పోర్టల్‌లో వ్యవసాయశాఖ నమోదు చేసి ఆ భూములు అమ్మిన పాత రైతుల వివరాలను తొలగించాలి. ఆ తరువాత రైతుబంధు పోర్టల్‌ను తెరిచేందుకు ‘వ్యవసాయ విస్తరణ అధికారుల’(ఏఈఓ)కు అనుమతి ఇవ్వాలి. కొత్తగా భూములు కొన్నవారి పేర్లకు ఎదురుగా వారి బ్యాంకు పొదుపు ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు, దాని ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను ఏఈఓలే గ్రామస్థాయిలో పరిశీలించి రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాలి. తమ పేర్లను నమోదు చేయాలని రైతులు ఏఓఓలు, మండల స్థాయిలో ఉండే వ్యవసాయాధికారుల (ఏఓ) చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శుక్రవారం వరకూ ఈ పోర్టల్‌ను తెరిచే అవకాశమే తమకు ఇవ్వలేదని పలువురు ఏఈఓలు ‘ఈనాడు’కు చెప్పారు. దీనిపై వ్యవసాయశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి, ఇన్‌ఛార్జి కమిషనర్ రఘునందన్‌రావును వివరణ అడగ్గా ‘ప్రక్రియ కొనసాగుతోంది’ అని మాత్రమే చెప్పారు.
EATALA: ఎమ్మెల్యే పదవికి ఇవాళ రాజీనామా చేయనున్న ఈటల!