ప్రజా ప్రతినిధుల కోర్టులో మంత్రి సత్యవతి రాఠోడ్‌కు ఊరట లభించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించారని వెంకటాపురం పీఎస్‌లో నమోదైన కేసును గురువారం న్యాయమూర్తి కొట్టివేశారు. సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవితతో పాటు.. మాజీ మంత్రి చందూలాల్, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌లపై నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది. మరో కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే సాయన్నకు సమన్లు జారీచేశారు.
మంత్రి సత్యవతి రాఠోడ్‌కు ఊరట - hyderabad latest updates
పలువురు ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టిపారేసింది. వీరిలో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవితతో పాటు.. మాజీ మంత్రి చందూలాల్, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌లు ఉన్నారు.
ప్రజా ప్రతినిధుల కోర్టు
వైఎస్. విజయమ్మ, షర్మిలపై పరకాల ప్రచారం కేసును ఈ నెల 15కి వాయిదా వేశారు. వేర్వేరు కేసుల్లో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, రాజయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, శంకర్ రావులు గురువారం కోర్టుకు హాజరయ్యారు.