మహిళ కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్‌పై నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 2017లో హరితహారం కార్యక్రమం జరుగుతుండగా అప్పటి కలెక్టర్ ప్రీతిమీనా పట్ల శంకర్ నాయక్ అనుచితంగా ప్రవర్తించార్న ఆరోపణలు వచ్చాయి. ఆమె ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పోలీసులు శాసనసభ్యుడిపై కేసు నమోదు చేసి.. ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఛార్జ్ షీట్‌పై ఇవాళ తీర్పు వెల్లడించింది. పోలీసులు అభియోగాలను తగిన ఆధారాలతో రుజువు చేయనందున.. శంకర్ నాయక్‌పై కేసును కొట్టివేసింది.
శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిన్నారెడ్డిపై గతేడాది నమోదయిన రెండు కేసులు వీగిపోయాయి. నామినేషన్ సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని వనపర్తిలో నమోదైన కేసులను కొట్టివేసింది. అనుమతి లేకుండా కార్యకర్తల సమావేశం నిర్వహించారని పెబ్బేరులో నమోదైన కేసులను సైతం వీగిపోయింది.