తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశం గొప్ప నేతను కోల్పోయింది: భాజపా - దత్తాత్రేయ

భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు అరుణ్​ జైట్లీకి నివాళులర్పించారు. ఈసందర్భంగా నిర్వహించిన సంతాపసభలో జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్‌, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, దత్తాత్రేయ, రాంచందర్‌రావు, డీకే.అరుణ, వివేక్‌, నల్లు ఇంద్రసేనారెడ్డి జైట్లీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

దేశం గొప్ప నేతను కోల్పోయింది

By

Published : Aug 24, 2019, 11:39 PM IST

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్‌ జైట్లీ మృతి పట్ల రాష్ట్ర భాజపా నేతలు సంతాపం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్‌, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, దత్తాత్రేయ, రాంచందర్‌రావు, డీకే.అరుణ, వివేక్‌, నల్లు ఇంద్రసేనారెడ్డి జైట్లీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కశ్మీర్​ విషయంలో ముందు జైట్లీని సంప్రదించిన తర్వాతనే నిర్ణయానికి వద్దామని స్వయాన ప్రధాని మోదీ చెప్పారని రాంమాధవ్​ వెల్లడించారు. విద్యార్థి నేత నుంచి అంచెలంచెలుగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆర్థిక,న్యాయ, రక్షణ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు.రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు.

దేశం గొప్ప నేతను కోల్పోయింది

ABOUT THE AUTHOR

...view details