తెలంగాణ

telangana

ETV Bharat / state

2020 రౌండప్​: కరోనా కాటేసినా.. నిలబడ్డ నిర్మాణరంగం - gradually growing construction sector in Hyderabad

గ్రేటర్​ హైదరాబాద్​లో నిర్మాణరంగం క్రమేనా పెరుగుతోంది. ప్రతి ఏడాది జంట నగరాల్లో భారీగా నిర్మాణాలు చేస్తున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారితో లాక్​డౌన్​తో పాటు భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ... గ్రేటర్​ హైదరాబాద్​లో నిర్మాణ రంగం మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది కాలంలో గ్రేటర్​ వ్యాప్తంగా 10వేల 541 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు బల్దియా వెల్లడించింది. దీని ద్వారా రూ.685.81 కోట్ల మొత్తం జీహెచ్​ఎంసీకి ఆదాయంగా లభించింది.

2020 రౌండప్​: కరోనా కాటేసినా.. నిలబడ్డ నిర్మాణరంగం
2020 రౌండప్​: కరోనా కాటేసినా.. నిలబడ్డ నిర్మాణరంగం

By

Published : Dec 29, 2020, 12:49 PM IST

గ్రేటర్​ హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగం దూసుకుపోతుంది. ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. 2020 ఏడాది కాలంలో అధిక సంఖ్యలో 10వేల 541 నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాల్లో 8వేల 938 ఇండిపెండెంట్​, 1359 గ్రూప్ హౌసింగ్​ల నిర్మాణాలకు బల్దియా అనుమతులు జారీచేశారు. వీటితో పాటు 113 కమర్షియల్ భవనాలు, 117 హైరైజ్ నివాస భవనాలకు, 24 హైరైజ్ కమర్షియల్ భవనాలకు, రెండు మల్టీప్లెక్స్​లకు జీహెచ్ఎంసీ అనుమతులు జారీచేసింది.

పకడ్బందీగా అమలు

భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేయడం, నియమిత రోజుల్లోనే అనుమతులు మంజూరు చేయడంతో గ్రేటర్ హైదరాబాద్​లో భవన నిర్మాణ రంగం పురోగతిలో సాధిస్తోంది. 2016 జూన్ 2న ఆన్​లైన్ భవన నిర్మాణ అనుమతుల విధానం డెవలప్​మెంట్ పర్మీషన్ మేనేజ్​మెంట్ సిస్టం ప్రవేశపెట్టారు. దీంతో భవన నిర్మాణం, లేఅవుట్​ల అనుమతులు జారీ చేయడం, ఆన్​లైన్​లోనే అక్యుఫెన్సి సర్టిఫికేట్లు జారీచేయడం, ఆన్​లైన్ భవన నిర్మాణ అనుమతులను పకడ్బందీగా అమలు చేస్తోంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో భాగంగా కేవలం 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులను జారీచేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సరళతరం చేయడం, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దికై సిటీ లేవల్ ఇన్ ఫ్యాక్ట్ ఫీజులో ఉన్న స్లాబ్​లను తగ్గించడం కూడా ఈ రంగం అభివృద్దికి దోహదపడ్డాయి.

వివరాలిలా...

రాష్ట్ర ఆవిర్భావం నుంచి గ్రేటర్ హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయ పురోగతిలో సాధించింది. 2010 నుంచి 2014 వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 733 కమర్షియల్ ప్రాజెక్ట్​ల ద్వారా 5 కోట్ల 72 లక్షల 657 ఎస్ఎఫ్​టీల అనుమతులు జారీ అయ్యాయి. 2015 నుంచి 2019 వరకు 917 ప్రాజెక్ట్​లకు 10 కోట్ల 43 లక్షల 55 వేల 5 ఎస్ఎఫ్టీల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. 2015 నుంచి 2019 దాక 11 వేల 24 గృహ నిర్మాణ ప్రాజెక్ట్​లకు అనుమతులు జారీచేశారు. ఇదే కాలంలో 65 వేల 953 భవన నిర్మాణ అనుమతులను జారీచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేస్తున్న డీపీఎంఎస్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ప్రశంసలు వచ్చాయి. 2010 నుంచి 2014 వరకు 45 వేల 820 అనుమతుల మంజూరు ద్వారా రూ. 2189.20 కోట్ల ఆదాయం లభించగా 2015 నుంచి 2019 వరకు 65 వేల 953 అనుమతులు జారీచేయగా రూ. 3 వేల 507.55 కోట్లు లభించాయి.

ABOUT THE AUTHOR

...view details