కోర్డు ఆదేశాలు అమలు చేయనందున గద్వాల కలెక్టర్ శశాంక్ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. 3 నెలల్లో ఉత్తర్వులు అమలయ్యేలా చూస్తానని హామినిచ్చారు.
అసలేం జరిగిందంటే...
కోర్డు ఆదేశాలు అమలు చేయనందున గద్వాల కలెక్టర్ శశాంక్ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. 3 నెలల్లో ఉత్తర్వులు అమలయ్యేలా చూస్తానని హామినిచ్చారు.
అసలేం జరిగిందంటే...
శశాంక్ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు నగరంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ విస్తరణలో భాగంగా కూల్చేసిన దుకాణాదారులకు పరిహారం లేదా దుకాణాలు కేటాయించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. వాటిని అమలు చేయలేదని శశాంక్‌పై కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలైంది. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి శశాంక్‌కు నెల రోజుల జైలు శిక్ష, జరిమానా విధించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ దాఖలు చేసిన శశాంక్... విచారణకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు క్షమాపణ కోరి... 3 నెలల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. దీన్ని పరిగణంలోకి తీసుకున్న ధర్మాసనం... శశాంక్‌పై శిక్షను 3 నెలల పాటు నిలిపేస్తూ ఉత్తర్యులు జారీ చేసింది.
ఇదీ చూడండి: హరేన్ పాండ్య హత్యకేసులో 12 మందికి శిక్ష