తెలంగాణ

telangana

ETV Bharat / state

Temperature in Telangana Today : రాష్ట్రంలో మళ్లీ పెరిగిన చలి.. అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు - Telangana Weather updates

Temperature in Telangana Today: రాష్ట్రంలో చలిపులి మళ్లీ పంజా విసురుతోంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా ఆదిలాబాద్​ జిల్లాలోని అర్లి(టి)లో 6, జిల్లా కేంద్రంలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Cold weather in TS
రాష్ట్రంలో మళ్లీ పెరిగిన చలి

By

Published : Feb 6, 2022, 8:16 AM IST

Temperature in Telangana Today : రాష్ట్రంపై చలి మళ్లీ పంజా విసురుతోంది. రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున చలి తీవ్రత బాగా పెరిగింది. తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా అర్లి(టి)(ఆదిలాబాద్‌ జిల్లా)లో 6, ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

చలిగాలులే కారణం

Telangana Weather News : తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో చలిగాలులు వీస్తున్నందున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో సైతం చలి తీవ్రత పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details