రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ - తెలంగాణ వార్తలు
22:10 May 24
రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్
రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలని సూచించారు. సూపర్ స్ప్రెడర్లకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని చెప్పారు. విధివిధానాలు ఖరారు చేయాలని మంత్రి హరీశ్ రావు, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో వ్సాక్సిన్ కొరతతో కేవలం 45 ఏళ్లు దాటిన వారికే టీకా ఇస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత రెండో డోస్ వరకే పరిమితం చేశారు. కొద్ది రోజుల క్రితం నుంచి వ్సాక్సినేషన్ బంద్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నేటి నుంచి టీకా ఇవ్వానున్నారు.
ఇదీ చదవండి:కరోనా పరీక్షలు మరింత పెంచాలి: సీఎం కేసీఆర్