తెలంగాణ

telangana

కిలిమంజారోను అధిరోహించిన 9ఏళ్ల చిన్నారి

By

Published : Feb 28, 2021, 9:43 AM IST

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల రిత్వికశ్రీ.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో చాటింది.

rithvika sri, kilimanjaro
రిత్విక శ్రీ, కిలిమంజారో

ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతంపై మన దేశ జాతీయ జెండా మరోసారి రెపరెపలాడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల రిత్వికశ్రీ.. 5,685 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఈ నెల 17న పర్వతారోహణకు బయలుదేరిన చిన్నారి.. 20న దక్షిణాఫ్రికా చేరుకుని గైడ్‌తో కలిసి ప్రయాణం ప్రారంభించింది.

7 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణం ఈ నెల 27న ఏ ఆటంకాలు లేకుండా ముగిసిందని రిత్వికశ్రీ తండ్రి కడపల శంకర్‌ తెలిపారు. ఆసియా ఖండం నుంచి చిన్నవయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా రిత్వికశ్రీ రికార్డులకెక్కగా.. ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బాలికకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:క్యూఆర్‌ కోడ్‌తో కరెంటు బిల్లులు.. కొత్త విధానంపై కసరత్తు

ABOUT THE AUTHOR

...view details