* తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రూ.18.50 కోట్లతో ప్రతిపాదించిన తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ(టీఎస్‌సీఈఎల్‌డీ) ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ బాల్యాన్ తెలిపారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.
* రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పనులు 2020 ఆగస్టు నాటికి 99.70 శాతం పూర్తయినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ తెలిపారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు. తెలంగాణకు 5 జీవ రసాయన/జీవ ఎరువుల యూనిట్లను మంజూరు చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌తోమర్ తెలిపారు. మానవ హక్కుల కార్యకర్తలపై వేధింపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 2017 నుంచి 2021 వరకు 7 కేసులు, తెలంగాణలో 8 కేసులు నమోదైనట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.