తెలంగాణ

telangana

ETV Bharat / state

నయీం కేసులో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశం - Central government on Naeem case

గ్యాంగ్​స్టర్ నయీం కేసు దర్యాప్తుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని... కేంద్రం ఆదేశించింది. నయీం కేసు సీబీఐకి అప్పగించాలంటూ ప్రధానికి సుపరిపాలన వేదిక కన్వీనర్‌ పద్మనాభ రెడ్డి లేఖ రాశారు.

నయీం కేసులో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశం
నయీం కేసులో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశం

By

Published : Mar 8, 2021, 4:56 PM IST

Updated : Mar 8, 2021, 5:11 PM IST

నయీం కేసు దర్యాప్తుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని... కేంద్రప్రభుత్వం ఆదేశించింది. నయీం కేసు సీబీఐకి అప్పగించాలంటూ ప్రధానికి లేఖ రాసిన సుపరిపాలన వేదిక కన్వీనర్‌ పద్మనాభ రెడ్డి... నాలుగేళ్లు ఏదాటినా కేసులో పురోగతి లేదని వివరించారు. సుపరిపాలన వేదిక లేఖపై స్పందించిన కేంద్రం.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాసింది.

నయీం కేసును సీబీఐకి ఇవ్వాలని గతంలో సుపరిపాలన వేదిక చేసిన విజ్ఞప్తిని సీఎస్ తిరస్కరించారు. కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఈ తరుణంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నయీం ఎన్‌కౌంటర్ కేసులో దర్యాప్తు సక్రమంగా కొనసాగడం లేదని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఇదివరకే ఆరోపించారు. ఎన్‌కౌంటర్ జరిగి 5 ఏళ్లు గడిచినా నయీం... నేర సామ్రాజ్యానికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర బృందం దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

నయీంకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీస్​ అధికారులకు సిట్​ క్లీన్​ చిట్​ ఇవ్వడం పట్ల కూడా ఆయన అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. నయీం​ ఎన్​కౌంటర్ తర్వాత 173 నేరాభియోగ పత్రాలు న్యాయస్థానంలో దాఖలు చేసినా.. ఏ ఒక్క కేసులో దర్యాప్తు పూర్తి కాలేదని ఆరోపించారు. ఈ మేరకు అప్పట్లో సీఎస్​కు లేఖ రాసినా ఆయన తిరస్కరించారు.

ఇదీ చదవండి:చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి: తలసాని

Last Updated : Mar 8, 2021, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details