దుబ్బాకకు తరలించేందుకు భాజపా అభ్యర్థి సమీప బంధువు వద్ద కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కోరారు. స్వేచ్ఛ, శాంతియుతంగా జరగాల్సిన ఎన్నికలను డబ్బు మాయం చేసేందుకు భాజపా పదేపదే ప్రయత్నించడం క్షమార్హం కాదని ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
భాజపాపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీకుకోవాలి: చాడ - chada on Dubbaka Elections
భాజపాపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వేచ్ఛ, శాంతియుతంగా జరగాల్సిన ఎన్నికలను డబ్బు మాయం చేసేందుకు భాజపా పదేపదే ప్రయత్నించడం క్షమార్హం కాదని ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
భాజపాపై ఎన్నికల సంఘం చర్యలు తీకుకోవాలి
తాజా ఘటనను కలుపుకొని దుబ్బాక భాజపా అభ్యర్థికి సంబంధించిన నగదు స్వాధీనం చేసుకోవడం ఇది మూడోసారన్నారు. ఎన్నికల సంఘం కఠిన వైఖరి తీసుకోకపోతే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం పోతుందన్నారు.