కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను తక్షణమే చేపట్టాలని.. లేని పక్షంలో యుద్ధం ప్రకటిస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరించారు. హైదరాబాద్ లక్డీకపూల్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై తెరాస ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు రాజయ్య తెలిపారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలిసేందుకు వెళ్తే... మోదీ ముఖం చాటేశారని గుర్తుచేశారు. వంద రోజుల్లో వర్గీకరణ చేపడతామన్న భాజపా ప్రభుత్వం... ఐదు సంవత్సరాలైన పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి: రాజయ్య - తాటికొండ రాజయ్య
కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, లేని పక్షంలో యుద్ధం ప్రకటిస్తామని తెరాస ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
కేంద్రం తక్షణమే ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి: రాజయ్య