తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.3,12,191 కోట్లకు చేరిన తెలంగాణ అప్పులు - Telanganas debts till 2022

రూ.3,12,191 కోట్లకు చేరిన తెలంగాణ అప్పులు
రూ.3,12,191 కోట్లకు చేరిన తెలంగాణ అప్పులు

By

Published : Dec 19, 2022, 4:35 PM IST

Updated : Dec 19, 2022, 4:51 PM IST

16:30 December 19

రూ.3,12,191 కోట్లకు చేరిన తెలంగాణ అప్పులు

రాష్ట్ర అప్పుల భారం ఏటా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివరించింది. 2018లో రూ.లక్షా 60వేల 296.3 కోట్ల వరకు ఉన్న అప్పులు.. 2022 నాటికి రూ.3 లక్షల 12 వేల 191.3 కోట్లకు చేరినట్లు పేర్కొంది. లోక్‌సభలో తెరాస ఎంపీలు వెంకటేశ్‌, రంజిత్‌రెడ్డి, కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2017-2018లో గతేడాదితో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి 16.7 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది.

రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం పేర్కొంది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. ఆ తర్వాత భారీగా పెరుగుదల ఉన్నట్లు ఆర్ధికశాఖ లెక్కల్లో వెల్లడైంది. 2022 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు వివరించింది.

ఇవీ చూడండి..

'చట్టాన్ని గౌరవించి ఈడీ విచారణకు వచ్చా.. అన్నీ అప్పుడే చెబుతా'

'పరువు' కోసం ప్రేమపై పగ.. కూతురి భర్తను వెంటాడి చంపిన తండ్రి

Last Updated : Dec 19, 2022, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details