అక్టోబర్ తొలివారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాలపై చర్చకు కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ లేవనెత్తిన అంశాలను ఈ అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించనున్నారు.
అక్టోబర్ తొలి వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం..!
18:59 September 28
అక్టోబర్ తొలి వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం..!
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. కౌన్సిల్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, జల వివాదాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఈ మేరకు అక్టోబర్ తొలి వారంలో భేటీ అయ్యేందుకు సిద్ధం కావాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ కార్యాలయం ఇరు రాష్ట్రాల సీఎంలకు సమాచారం పంపింది.
పోతిరెడ్డిపాడు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు కేంద్రానికి పరస్పర ఫిర్యాదు చేసుకోగా.. అపెక్స్ కౌన్సిల్ జరిగే వరకు పోతిరెడ్డిపాడు నిర్మాణం ఆపాలని ఇప్పటికే కేంద్ర మంత్రి ఆదేశించారు.
ఇదీచూడండి:దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను నిషేధించిన ప్రభుత్వం