తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలవరం నిధులకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు - పోలవరం అప్​డేట్స్

పోలవరం కోసం కేంద్రం తిరిగి చెల్లిస్తున్న నిధులకు ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేంద్రం నుంచి ఏపీకి ఇస్తున్న రూ.2,234కోట్లును ఆ ఖాతాకే మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పోలవరం నిధులకు  ప్రత్యేక ఖాతా ఏర్పాటు
పోలవరం నిధులకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు

By

Published : Dec 8, 2020, 10:23 AM IST

పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం తిరిగి చెల్లిస్తున్న(రీయింబర్స్) నిధులు ఇక నేరుగా ఆ పనులకు మాత్రమే వినియోగించేలా ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులు ఏపీ ప్రభుత్వ ఖాజానాకు జమచేసి ఆ నిధుల్లో కొన్ని ఇతర అవసరాలకు మళ్లిస్తున్న ఉందతాలు అనేకం ఉన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి పనులు చేసిన తర్వాత ప్రభుత్వం మెుదట బిల్లులు చెల్లించి ఆ తర్వాత పోలవరం అథారిటీ ద్వారా కేంద్రానికి ఆ బిల్లులు పంపి ఆ మెుత్తం కేంద్రం నుంచి పొందవలసి ఉంటుంది. ఆ నిధులు వచ్చే లోపు మళ్లీ కొంత పనులు జరిగి ఆ మేరకు బిల్లులు పెండింగులో ఉంటున్నాయి.

కేంద్రం ఇచ్చిన నిధులు నేరుగా తిరిగి పెండింగు బిల్లులకే ఖర్చు చేస్తే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇతరత్రా ప్రాధాన్య అవసరాలు ఉంటే వాటికి చెల్లించిన సందర్భాలు మెుదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఇక పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేకంగా కొత్త పి.డి. ఖాతా ప్రారంభించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం తెలిపాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దస్త్రంపై సంతాలు చేశారు. ఈ ఖాతా ఏర్పాటు, బిల్లుల చెల్లింపునకు సంబంధించి సీఎఫ్ఎంఎస్​లో మ్యాపింగ్ చేస్తున్నారని అధికారులు చెప్పారు. వర్క్స్ అకౌంటు, డైరక్టర్ ఆఫ్ ట్రెజరీ ద్వారా పనులకు, జీతాలకు చెల్లిస్తారు. పోలవరం అథారిటీ కూడా ఇక నేరుగా ఈ ఖాతాకే నిధులు పంపనుంది. ఈ కొత్త ఖాతాకు నిధులు ఎలా మళ్లించాలో తెలియజేయాలని పోలవరం అథారిటీ కోరిన మీదట అధికారులు ఆ ప్రక్రియ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇస్తున్న రూ.2,234కోట్లును ఆ ఖాతాకే మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మీదట ప్రతి బిల్లునూ(రూ.500కోట్లు) పోలవరం అథారిటీ తనిఖీ చేసి కేంద్రానికి పంపనుంది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు అథారిటీ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి:కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్​ను ఆహ్వానించిన రైతు..

ABOUT THE AUTHOR

...view details