హైదరాబాద్ మహానగరంలో సంక్రాంతి పండుగ నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర సాంస్కృతిక, పర్యటకశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పతంగుల వేడుక సికింద్రాబాద్‌లో మంగళవారం వైభవంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న పలువురు కళాకారులను మంత్రి ఘనంగా సత్కరించారు. వచ్చే ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏడాది వివిధ అంశాలను పెంచుతున్నట్లు ఆయన చెప్పారు.
రిమోట్‌తో ఎగురవేసిన పతంగులు
మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో 25 దేశాలకు చెందిన ప్రతినిధులు వివిధ రకాల పంతగులను ఎగురవేశారు. ఈ వేడుకల్లో సింగపూర్‌కు చెందిన ప్రతినిధులు రిమోట్‌తో ఎగురవేసిన పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వం గతేడాది కంటే ఈసారి ఏర్పాట్లు బాగా చేసారని సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా వచ్చి ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు.