ఏపీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతీరెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరించిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు...... ప్రకటనలు ఇవ్వటంలో ప్రభుత్వం అనుకూల ధోరణి, బంధుప్రీతి ప్రదర్శిస్తోందని విజయవాడకు చెందిన నాగశ్రవణ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం ప్రకటనలు జారీ చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. పక్షపాత వైఖరి అవలంభించడంతో పాటు వైకాపా రంగుల కలయికతో ప్రకటనలు ఇస్తోందన్నారు.
ఉల్లంఘిస్తున్నారు...
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అయినందున అక్కడ ఫిర్యాదు చేయాలని ధర్మాసనం సూచించింది. పిటిషనర్ తరపు న్యాయవాది బదులిస్తూ... ఆ తీర్పును చట్టంగా భావించాలని, దానిని అన్ని రాష్ట్రాలు పాటించాలని సుప్రీం స్పష్టం చేసిందన్నారు. ఇష్టం ఉన్న మీడియాను ప్రోత్సహించడం, లేనివాటిని పట్టించుకోకపోవడం సరికాదని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. పిల్ దాఖలు చేసిన మీరెవరు అని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రజా చైతన్యం కలిగిన వ్యక్తిగా దాఖలు చేసినట్లు న్యాయవాది శ్రవణ్ బదులిచ్చారు. ఏ నిబంధనల ప్రకారం పక్షపాత ధోరణో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ బదులిస్తూ ... సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. అందులోని వివరాల్ని చదివి వినిపించారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఏవిధంగా దర్యాప్తునకు ఆదేశిస్తుందని ధర్మాసనం అడగగా.... దర్యాప్తు అవసరం లేదని పిటిషనర్ వివరించారు. సహ చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు స్పష్టం అవుతోందన్నారు. ఈ వాదనలపై జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ ... సీఎం సహా ఇతరుల ఫొటోలు ప్రకటనలో ప్రచురించడానికి తాను వ్యక్తిగతంగా వ్యతిరేకం అన్నారు.
సీజే ధర్మాసనం ముందుకు...