తెలంగాణ

telangana

ETV Bharat / state

కోడి కోసం కొడుకును చంపిన తండ్రి - విజయనగరంలో కోడి కోసం కొడుకును చంపిన తండ్రి

కోడి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. తాను పెంచుకుంటున్న కోడిని కొడుకు చంపేయడం.. అది జీర్ణించుకోలేని తండ్రి కొడుకునే హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బొద్దిడి గ్రామంలో జరిగింది.

the-butchers-father-who-killed-his-son-for-cock-in-vizayanagaram
గుమ్మలక్ష్మీపురంలో కోడి కోసం కొడుకును చంపిన తండ్రి

By

Published : Feb 23, 2020, 9:04 PM IST

ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కొడుకునే తండ్రి పొట్టన పెట్టుకున్నాడు. బొద్దిడి గ్రామానికి చెందిన అడ్డాకుల కాంతారావు, మజ్జేశ్వరరావు తండ్రి కొడుకులు. తండ్రి కాంతారావు కోడిని పెంచుకుంటుండగా.. మజ్జేశ్వరరావు ఆ కోడిని చంపేశాడు.

ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాంతారావు కొడుకును కత్తితో పొడిచాడు. దీనితో మజ్జేశ్వరరావు మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి:బూడిద లోడుతో వెళ్తున్న లారీ బోల్తా... డ్రైవర్, క్లీనర్ మృతి

ABOUT THE AUTHOR

...view details