కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. దేశంలో ఉన్న ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే రీతిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యూహాత్మకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కొనియాడారు.
కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉంది: కె. లక్ష్మణ్ - latest news on k laxman
కేంద్ర బడ్జెట్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ స్పందించారు. ఆర్థిక మాంద్యాన్ని అధికమించే రీతిలో వ్యూహాత్మకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉంది: కె. లక్ష్మణ్
ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలకు ఊరట కలిగించే రీతిలో ఆదాయ పన్ను తగ్గింపులు ఇవ్వడం మంచి పరిణామమని తెలిపారు. సామాన్యులకు, రైతులకూ పెద్ద పీట వేశారన్నారు. రూ. 5 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయించడం హర్షనీయమని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:కాళేశ్వరానికి జాతీయ హోదా కోరినా స్పందించలేదు: నామ