తెలంగాణ

telangana

ETV Bharat / state

'బడ్జెట్​లో హైదరాబాద్​ నగరానికి రూ. 10వేల కోట్లు కేటాయించాలి' - Telangana news

వచ్చే బడ్జెట్​లో హైదరాబాద్​ నగరానికి రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి. నాలాలు, ఋరద రహదారుల విస్తరణ, మంచినీటి సౌకర్యం కోసం రూ. 10వేల కోట్లు కేటాయించాలన్నారు.

'బడ్జెట్​లో హైదరాబాద్​ నగరానికి రూ. 10వేల కోట్లు కేటాయించాలి'
'బడ్జెట్​లో హైదరాబాద్​ నగరానికి రూ. 10వేల కోట్లు కేటాయించాలి'

By

Published : Mar 13, 2021, 8:00 PM IST

వచ్చే బడ్జెట్​లో హైదరాబాద్ మహానగరానికి రూ. 10 వేల కోట్లు కేటాయించాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నా... మౌలిక సదుపాయాలు పెంచాలన్నా... అధిక నిధులు కేటాయించాల్సిందేనని ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

గతేడాది వచ్చిన భారీ వర్షాల వల్ల నగరంలో రహదారులు, మురికి కాల్వల వ్యవస్థ దెబ్బతిన్నాయని... బస్తీల్లో ఇప్పటికీ ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని పద్మనాభ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి పలు కమిటీలు ఎన్నో నివేదికలు ఇచ్చినా... అమలుకు నోచుకోలేదన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివాసయోగ్యమైన జాబితాలో హైదరాబాద్​కు 24వ స్థానం రావడం పరిస్థితికి అద్దం పడుతోందని పద్మనాభ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా నాలాలు, రహదారుల విస్తరణ, మంచినీటి సౌకర్యం కోసం రూ. 10వేల కోట్లు కేటాయించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి :ఆ స్కెచ్​పెన్​తో మాత్రమే ఓటు వేయాలి: ఈసీ

ABOUT THE AUTHOR

...view details