హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్మా మిడి రాజుకు బ్రెయిన్ డెడ్ అయిందని యశోద ఆస్పత్రి వైద్యులు నిర్ధరించారు. సైదాబాద్‌కు చెందిన రాజు విధులు ముగించుకుని ఇంటికెళ్తున్న సమయంలో చాదర్ఘట్ బ్రిడ్జిపై కుక్కలు అడ్డుగా వచ్చాయి. అదుపుతప్పి ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపైనుంచి కిందపడ్డాడు. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ బ్రెయిన్‌డెడ్ - సుల్తాన్ బజార్ క్రైం వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో ఓ పోలీసు కానిస్టేబుల్ విధులు నిర్వహించి ఇంటికెళ్తున్న సమయంలో మృత్యువు వెంటాడింది. మార్గమధ్యలో కుక్క అడ్డుగా వచ్చి బైక్‌పై నుంచి కింద పడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేరాడు. మృత్యువు నుంచి తప్పించుకున్నాడు కానీ తిరిగి విధుల్లో చేరలేకపోయాడు. చివరకు బ్రెయిన్ పనిచేయకుండా మారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో జరిగింది.
కానిస్టేబుల్‌ను వెంటాడిన మృత్యవు చివరికి..!
వెంటనే యశోద ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యలు బ్రెయిన్‌డెడ్ అయిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన గుండె మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు. తనతోపాటు విధులు నిర్వహించిన సహచర ఉద్యోగి బ్రెయిన్‌డెడ్ అవడం పట్ల పలువురు పోలీసు సిబ్బంది విషాదంలో మునిగిపోయారు.
ఇదీ చూడండి :చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది