డిగ్రీలో ఏ కోర్సు చదివినా పీజీలో ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో చేరేందుకు అర్హత కల్పించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇప్పటి వరకు డిగ్రీలో సంబంధింత సబ్జెక్టు చదివి ఉంటేనే పీజీలో దానికి సంబంధించిన కోర్సులో చేరేందుకు అర్హత ఉంది. ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారెవరైనా చేరేలా మార్పులు చేయాలని ఈరోజు వీసీల సమావేశంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
పీజీ ప్రవేశాల్లో ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడేళ్లలో ఒక్క విద్యార్థి కూడా చేరని కళాశాలలు, కోర్సులను మూసివేయాలని నిర్ణయించింది. తద్వారా రాష్ట్రంలో సుమారు 250 డిగ్రీ, పీజీ కాలేజీలు మూత పడే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు న్యాక్ గుర్తింపు పొందేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. న్యాక్ గుర్తింపు పొందేందుకు లక్ష రూపాలయ ఆర్థిక సాయంతో పాటు.. అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి వీసీలకు తెలిపారు.