అసోంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజెన్స్ యాక్ట్ పేరుతో కుట్రపూరితంగా 19 లక్షల మంది స్వదేశీ పౌరుల గుర్తింపులను తొలగించారని కమ్యునిస్టు నాయకులు ఆరోపించారు. ఎన్.ఆర్.సి యాక్ట్ ప్రవేశపెట్టిన దినాన్ని ఎస్.యు.సి.ఐ(సి)పార్టీ జాతీయ నిరసన దినంగా ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ బషీర్‌బాగ్ కూడల్లో సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ( కమ్యూనిస్టు ), ఎస్.యు.సి.ఐ(సి)పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజల ఐక్యతను దెబ్బతీయడమే ధ్యేయంగా భాజపా వ్యవహరిస్తుందని వారు విమర్శించారు. వారిని వెంటనే భారతీయ పౌరులుగా గుర్తించి ఆ యాక్ట్‌ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
భాజపా ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుంది
అసోంలో ఎన్.ఆర్.సీ యాక్ట్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 19 లక్షల మంది స్వదేశీ పౌరుల గుర్తింపును తొలగించారని కమ్యునిస్టు సంఘాలు ఆరోపించాయి. ఎన్ఆర్సీ యాక్ట్ ప్రవేశపెట్టిన దినాన్ని జాతీయ నిరసన దినంగా ఎస్.యు.సి.ఐ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో నిరసన చేపట్టారు.
భాజపా ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుంది