శాసనమండలిలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. సమావేశానికి వెళ్తున్న మంత్రి అజయ్‌కుమార్‌ను మార్షల్స్ ఆపివేశారు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా షాకయ్యారు. తాను మంత్రినేనని ఆయన సమాధానం చెప్పిన తరువాతే లోనికి అనుమతించారు.
'మంత్రికి షాకిచ్చిన మార్షల్స్' - హైదరాబాద్ తాజా వార్తలు
మంత్రి అజయ్‌కుమార్‌ను మార్షల్స్ ఆపేశారు.. ఎక్కడనుకుంటున్నారు. తెలంగాణ శాసన మండలి సమావేశాల సందర్భంగా మండలిలోకి వెళ్తున్న మంత్రిని మార్షల్స్ అడ్డుకున్నారు. తాను మంత్రినేనని చెప్పాకే తప్పు గ్రహించి సభలోకి అనుమతించారు.
మంత్రికి ఎదురైన చేదు అనుభవం
మార్షల్స్ వైఖరిపై మంత్రి అజయ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి :ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
Last Updated : Mar 7, 2020, 9:27 PM IST