Biggest Christmas star : ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కోటగిరిలంకలోని ఆర్సీఎం చర్చి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెల్లా అతిపెద్ద క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేసారు. క్రైస్తవులే కాకుండా హిందువులు సైతం ఇక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. హిందువులు కూడా ఇక్కడ అన్నప్రాసనలు, అక్షరాభ్యాసం, తలనీలాలు సమర్పణ వంటి కార్యక్రమాలు జరుపుకొంటారు. ఈ క్రిస్మస్ స్టార్ 35 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తు, 75 చిన్న స్టార్లు సుమారు 480 ట్యూబ్ లైట్లతో అతిపెద్ద స్టార్‌ను ఏర్పాటు చేశారు.
35 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తుతో క్రిస్మస్ స్టార్.. ఎక్కడంటే? - Krishna Latest News
Biggest Christmas star : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కోటగిరిలంక ఆర్సీఎం చర్చి వద్ద అతిపెద్ద క్రిస్మస్ స్టార్‌ను ఏర్పాటు చేశారు. 35 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తు.. మొత్తం 75 స్టార్లతో సుమారు 480 ట్యూబ్‌లైట్లతో అతిపెద్ద స్టార్ ఏర్పాటు చేశారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు క్రిస్మస్ రోజున ఇక్కడకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

అతిపెద్ద క్రిస్మస్ స్టార్
అతిపెద్ద క్రిస్మస్ స్టార్
అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు క్రిస్మస్ రోజున ఇక్కడకు వస్తారు. ప్రతి సంవత్సరం కిస్మస్ నుంచి సంక్రాంతి వరకు 'స్టార్' ఇలాగే కాంతులు వెదజల్లుతూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుందని స్థానికులు తెలిపారు.
ఇవీ చదవండి: