తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు రాష్ట్రంలో బీసీ కమిషన్​ పర్యటన - bc commission

నేడు రాష్ట్రంలో జాతీయ బీసీ కమిషన్​ పర్యటించనుంది.  రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించిన తర్వాత తొలిసారి తెలంగాణకు రాబోతుంది. ఛైర్మన్​ భగవాన్​లాల్​ సహాని, వైస్​ ఛైర్మన్​ డా. లోకేశ్​ కుమార్​ ప్రజాపతితోపాటు కమిటీ సభ్యులు హైదరాబాద్​ రానున్నారు.

బీసీ కమిషన్​

By

Published : Jul 8, 2019, 6:44 AM IST

Updated : Jul 8, 2019, 7:45 AM IST


రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించిన తర్వాత జాతీయ బీసీ కమిషన్​ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా హైదరాబాద్​ రానుంది. ఛైర్మన్​ భగవాన్​లాల్​ సహాని, వైస్​ ఛైర్మన్​ డా. లోకేశ్​ కుమార్​ ప్రజాపతితో, సభ్యులు తల్లోజు ఆచారి, కౌసలేంద్ర పటేల్​, సుదాయాదవ్​లతో కూడిన బృందం రవీంద్రభారతిలో ఒంటి గంటకు సమావేశం కానుంది. ఇటీవల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య ఆధ్వర్యంలో దిల్లీకి వెళ్లి కమిషన్​ను కలిసి హైదరాబాద్​కు రావాలని కోరారు. సమావేశంలో బీసీ, కుల, ఉద్యోగ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను కమిషన్​కు అందజేస్తామని ఆర్​. కృష్ణయ్య తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయా? లేదా? తెలుసుకుని అమలు చేయించే అధికారం కమిషన్​కు ఉంటుందన్నారు.

Last Updated : Jul 8, 2019, 7:45 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details