బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ 19వ వార్షికోత్సవ వేడుకలను ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, బోర్డు సభ్యులు కోడెల శివప్రసాద్ రావు, నామ నాగేశ్వరరావు, సంస్థ ఉద్యోగులు, తదితర నేతలు పాల్గొన్నారు.
దివంగత నేత నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం 19వ వార్షికోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు. మహోన్నత ఆశయంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని కోడెల శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. సేవలు మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.