హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి అవుట్ పేషంట్ వార్డులోని చెత్తడబ్బాలో పసికందు లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును పడేసి పోయారు. పరీక్షల కోసం పాపను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున బురఖా ధరించిన మహిళ.. చెత్తకుండీలో పడేసినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఉదయం క్లీనింగ్ సిబ్బంది శిశువును గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు.
ఆడపిల్ల పుట్టిందని చెత్తడబ్బాలో పడేశారు..! - ఫివర్ ఆసుపత్రిలోని చెత్తడబ్బాలో పసికందు
ఆడపిల్ల అంటే మహాలక్ష్మీగా కొలుస్తారు. అల్లారు ముద్దుగా చూసుకుంటారు. కానీ ఓ ఆసుపత్రిలో పసిబిడ్డను చెత్తడబ్బాలో పడేసిపోయారు. ఈ ఘటన ఫీవర్ ఆసుపత్రి అవుట్ పేషంట్ వార్డులో చోటుచేసుకుంది.
![ఆడపిల్ల పుట్టిందని చెత్తడబ్బాలో పడేశారు..! the-baby-was-dumped-in-the-trash-can-at-fever-hospital-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7315958-170-7315958-1590225915499.jpg)
ఆడపిల్ల పుట్టిందని... చెత్తడబ్బాలో వదిలేశారు..!!