సికింద్రాబాద్ మేడిబావిలోని ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో అగ్నిహోత్ర క్రతువు నిర్వహించారు. ఔషధ మూలికలతో ఉన్న సమిధలతో యజ్ఞం చేయడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని వివరించారు. అగ్రిహోత్రంలో నెయ్యి వేసినట్లైతే... అది కాలి బూడిదగా మారి దాని నుంచి ఉత్పన్నమయ్యే అణువులు, వాయువులు ఎంత దూరం వ్యాపిస్తాయో అంత వరకు గాలి, ధ్వని, నీటి కాలుష్యాలను దూరం చేస్తుందని ప్రాచీన రుషులు అందించిన విజ్ఞాన శాస్త్రం చెబుతుందని స్పష్టం చేశారు.
కొవిడ్ కట్టడికి ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో అగ్నిహోత్రం - ఆర్యసమాజ్‌లో యజ్ఞం
కొవిడ్ వైరస్‌ను పారదోలేందుకు సికింద్రాబాద్ మేడిబావిలోని ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో అగ్నిహోత్రం జరిపించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యజ్ఞం నిర్వహించామని తెలిపారు.
హైదరాబాద్ వార్తలు
ఆధునికంగా కూడా ఎంతో మంది వైజ్ఞానికులు పరిశోధన చేసి నిరూపించారని గుర్తు చేశారు. 1982లో భోపాల్ గ్యాస్ లీకేజీ అనంతరం... ఓ రెండు ఆర్యసమాజ్ కుటుంబాలు తమ ఇంట్లోనే యజ్ఞం చేయడం వల్ల ఆ కుటుంబాలు మినహా అంతా ప్రభావానికి గురయ్యారని ఆర్య సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. గాలి, పర్యావరణం శుద్ధి, కరోనా నివారణకు ఈ మహత్తర హవనం తోడ్పడుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:చర్లపల్లి జైలులో ఖైదీల వ్యవసాయం.. 180 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి