తెలంగాణ

telangana

ETV Bharat / state

స్థానిక సమరం: సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం?

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో... ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ వైకాపా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన చేస్తోంది.

the-ap-government-is-planning-to-go-to-the-supreme-court-as-it-is-not-possible-to-hold-elections
స్థానిక సమరం: సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం?

By

Published : Jan 9, 2021, 1:32 PM IST

ఆంధ్రప్రదేశ్​లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యులు విడుదలపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయాలని భావిస్తోంది.

పంచాయితీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు షెడ్యూలు జారీ చేయటంతో పాటు రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోందంటూ ప్రోసీడింగ్స్ జారీ చేయటంపై ఏపీ ప్రభుత్వం ఈ కార్యాచరణ చేపట్టనుంది. ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కొనసాగుతున్న కారణంగా.. జగన్ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుందని సమాచారం.

ఇదీ చదవండి:ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత... రేవంత్ రెడ్డి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details