తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి' - Judge of the ensuing court

ప్రసూతి, గైనకాలజికల్​ సోసైటీ వార్షిక సమావేశాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి భరోస కోర్టు న్యాయమూర్తితో పాటు సినీయర్ ఐపీఎస్ అధికారిణి సుమతి హాజరయ్యారు.

the-annual-meeting-of-the-obstetrics-and-gynecological-society-was-held-in-hyderabad
'ఇది మహిళల భద్రతకు మంచి ముందుడుగు'

By

Published : Feb 9, 2020, 7:47 PM IST

మహిళల ఆరోగ్య సమస్యల్లో తెలంగాణ పోలీసులను భాగస్వాములను చేయడం సంతోషకరమని సినీయర్ ఐపీఎస్ అధికారిణి సుమతి పేర్కొన్నారు. ప్రసూతి, గైనకాలజికల్​ సోసైటీ వార్షిక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశానికి భరోసా కోర్టు న్యాయమూర్తితో పాటు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా లైంగిక దాడులకు గురైన బాధితులకు సంబంధించిన మాన్యువల్‌తోపాటు పోస్టర్‌ను సుమతి విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రతి వైద్యులు ఈ మాన్యువల్​లో సూచించిన మార్గదర్శకాల ప్రకారంగా నడుచుకున్నట్లయితే మహిళల భద్రతకు మంచి ముందడుగు అవుతుందని అమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రసూతి గైనకాలజికల్ సోసైటీ అధ్యక్షురాలు వింధ్య, కార్యదర్శి అరుణ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

'ఇది మహిళల భద్రతకు మంచి ముందుడుగు'

ఇదీ చూడండి:కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఐదుగురు!

ABOUT THE AUTHOR

...view details