ఏపీ రాజధాని కోసం రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ మరింత ఉద్ధృతంగా నిరసనలు జరుగుతున్నాయి. తూళ్లురు, మందడం,పెనుమాకలో రైతులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. తూళ్లురులో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. టెంటు వేయకుండా రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
మరింత ఉద్ధృతంగా అమరావతి రైతుల ఆందోళనలు - the altercation between the farmers and the police
ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా రైతులు ఆందోళన ఊపందుకుంది. తుళ్లూరు, మందడం,పెనుమాకలో వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు వినూత్నంగా నిరసన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరగుండు, సగం మీసంతో ధర్నా చేస్తున్నారు. ద్విచక్రవాహనాల మీదుగా ర్యాలీలకు నిర్ణయించారు. నెమ్మదిగా ఈ ఆందోళనలు రాజధాని సమీప గ్రామాలకు విస్తరిస్తున్నాయి. అమరావతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. మంగళగిరి, నిడమర్రు, బేతపూడిలో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నారు. అమరావతికి మద్దతుగా జిల్లా కోర్టులో విధులు బహిష్కరించి న్యాయవాదులు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇవీ చదవండి : నేటి నుంచి పుస్తకాల ప్రదర్శన షురూ...