యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ధృడత్వాన్ని సాధించవచ్చని నిరూపిస్తున్నారు హైదరాబాద్ మెట్‌పల్లికి చెందిన యోగా గురువు చిట్యాల బాలయ్య. 97 ఏళ్ల వయస్సులోనూ ఆసనాలు వేయడమే కాదు పలువురికి నేర్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గంటపాటు యోగపై ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఆసనాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం ఆసనాలు వేస్తే ఎలాంటి జబ్బులైనా దరిచేరివని.. యోగాతో శారీరకంగా, మానసికంగా ధృడత్వాన్ని సాధించవచ్చని నిరూపిస్తున్నారు.
97 ఏళ్ల వయసులో యోగా చేస్తు ఆదర్శంగా నిలుస్తున్న చిట్యాల బాలయ్య 97 ఏళ్ళు వయసు..
తొమ్మిది పదుల వయస్సులో చురుకుగా యోగాసనాలు వేస్తూ.. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ వృద్ధ యోగ గురువు. ఈయన నేర్పిన యోగాసనాలతో ఎంతోమంది యోగా గురువులు మారారు. 97 ఏళ్ళు వయసు మీద పడ్డ 20 ఏళ్ల యువకుని వలె ఆసనాలు వేస్తూ.. ఇతరులకు వేయిస్తూ.. అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు. ఈ గురువు వద్ద నేర్చుకున్న ఆసనాలతో ఎంతోమంది సంపూర్ణ ఆరోగ్యవంతులై యోగా గురువులు మారారు.
హైదరాబాద్ మెట్పల్లి పట్టణంలో వివేకానంద యోగ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గత 35 ఏళ్ల నుంచి పట్టణంలో ఎందరో యువకులకు వృద్ధులకు యోగాపై అవగాహన కల్పిస్తూ, ఆసనాలు వేయిస్తూ ఆసక్తి పెంచుతున్నారు. ప్రతిరోజు ఉదయం గంట పాటు సాయంత్రం గంట పాటు యోగాపై ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఆసనాలపై అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణకు వచ్చిన వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు.
పలు ప్రాంతాల్లో..
చిట్యాల బాలయ్య కేవలం మెట్పల్లిలోనే కాకుండా.. కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా యోగాపై ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి వారికి యోగాసనాలు నేర్పించారు. ప్రతిరోజు యోగా వేస్తే ఎలాంటి జబ్బులనైనా దూరం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు. చిట్యాల బాలయ్య చూపుతున్న యోగాపై చూపుతున్న మక్కువతో ఎంతోమంది ఆసనాలు నేర్చుకొని ఆరోగ్యాన్ని పొందుతున్నారు.
ఇదీ చూడండి: KCR: ఓరుగల్లులో సీఎం... మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ