స్వచ్ఛ భారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకెళ్లాలని బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ రాములు అన్నారు. గాడ్గే బాబా 63 వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం, రజక విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.
స్వచ్ఛ భారత్ పితామహుడి 63వ వర్ధంతి
స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా 63వ వర్ధంతిని హైదరాబాద్లోని ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్వచ్ఛ భారత్ పితామహుడి 63వ వర్ధంతి
ఈ కార్యక్రమానికి బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ రాములు ముఖ్య అతిథిగా హాజరై గాడ్గే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశాన్ని స్వచ్ఛ భారత్ ద్వారా నూతన సమాజ నిర్మాణానికి పాటుపడ్డారని, సమాజాన్ని సంస్కరణల వైపు నడిపిన ఘనత ఆయనకే దక్కిందని రాములు గాడ్గే సేవలను గుర్తుచేసుకున్నారు.
ఇదీ చూడండి: నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్