తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణలో అస్థిరతకు భాజపా కుట్ర' - That party for political instability in the state: Karne Prabhakar

కేంద్ర ప్రభుత్వం జోక్యం వల్లే ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ స్పందించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు.

that-party-for-political-instability-in-the-state-karne-prabhakar
రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం ఆ పార్టీ : కర్నె ప్రభాకర్

By

Published : Nov 29, 2019, 11:55 PM IST

తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం చేస్తున్న కేంద్రం ఆర్టీసీపై ఎలా స్పదింస్తుందని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఆర్టీసీని ఆదుకోవడానికి కేంద్రం ఏదైనా సాయం చేసి ఉంటే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పేది నిజమని నమ్మే వాళ్లమని అన్నారు.

ఆర్టీసీ నష్టాల్లో పాలుపంచుకోకుండా, సమ్మె విషయంలో కేసీఆర్​కు సలహాలిచ్చే హక్కు ఉండదని లక్ష్మణ్​కు తెలియకపోవడం విచారకరమన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ఉదారంగా వ్యవహరించారని పలువురు ప్రశంసిస్తుంటే, లక్ష్మణ్ మాత్రం చవకబారు విమర్శలు చేస్తూ తన స్థాయిని దిగజార్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం ఆ పార్టీ : కర్నె ప్రభాకర్

ఇదీ చూడండి : 'అఘాయిత్యాలకు పాల్పడితే బహిరంగంగా శిక్షించాలి'

ABOUT THE AUTHOR

...view details