తెలంగాణ

telangana

ETV Bharat / state

సీబీఎస్సీ ఫలితాల్లో దిల్లీ పబ్లిక్ స్కూల్​ మరోసారి అగ్రస్థానం

మంగళవారం విడుదల చేసిన సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాల్లో నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 100% ఉత్తీర్ణత సాధించడంపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

That delhi public school again topped the CBSE 12th class results
సీబీఎస్సీ ఫలితాల్లో దిల్లీ పబ్లిక్ స్కూల్​ మరోసారి అగ్రస్థానం

By

Published : Jul 15, 2020, 1:18 PM IST

నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్ సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాల్లో మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 306 మంది విద్యార్థులకు 13 మంది నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా, 22 మంది విద్యార్థులు 95 శాతం సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ సునీతారావు తెలిపారు.

201 మంది విద్యార్థులు 80% పైగా స్కోరు సాధించారని ఆమె అన్నారు. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం పేరుపేరునా అభినందించింది. పాఠశాల ఛైర్మన్ కొమురయ్య, డైరెక్టర్ పల్లవి, ఉపాధ్యాయ బృందం చేసిన కృషి ఫలితంగా ఈ విజయం సాధించామని చెప్పారు. తమ పాఠశాలలో చదువుకే కాకుండా క్రీడలకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తామని ప్రిన్సిపల్ అన్నారు.

సీబీఎస్సీ ఫలితాల్లో దిల్లీ పబ్లిక్ స్కూల్​ మరోసారి అగ్రస్థానం

ఇదీ చూడండి :గాంధీ భవన్​కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details