tharunchug: తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని.. కేసీఆర్, ఆయన కుటుంబం మొత్తం పెత్తనం చేస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్ ఆరోపించారు. కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అలీబాబా 40 దొంగల తీరుగా మారి.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న తరుణ్‌చుగ్.. కేసీఆర్ పాలనపై "సాలు దొర.. సెలవు దొర" వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఇంకా 529 రోజులు మాత్రమే సీఎం కేసీఆర్‌కు సమయం ఉందని.. ఆ తర్వాత భాజపా అధికారంలోకి వస్తుందని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. జులై 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో భారీ సభ నిర్వహిస్తున్నామన్న ఆయన.. తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని చెప్పడానికే ఈ సభ పెడుతున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దళిత బంధు ఏమైంది, 2 పడక గదుల ఇళ్లు ఏమయ్యాయి. కేసీఆర్ పాలనపై 'సాలు దొర-సెలవు దొర' వెబ్సైట్ ప్రారంభిస్తున్నాం. జులై 3న పరేడ్ గ్రౌండ్లో భారీ సభ ఉంది. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా ఏర్పాట్లు చేస్తున్నాం.-తరుణ్‌చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ