కరోనా లాక్డౌన్ కారణంగా.. మహానగరంలో శానిటేషన్ పనులు చేస్తున్న కార్మికులకు దాతలు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. సికింద్రాబాద్ జోన్లోని జీహెచ్ఎమ్సీ వర్కర్లకు నెల రోజుల పాటు బట్టర్మిల్క్, బాదమ్పాలు పంపిణీ చేస్తానని గత నెల 27న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రటించారు.
"శేఖర్కమ్ములకు కృతజ్ఞతలు"జీహెచ్ఎమ్సీ సిబ్బంది ప్రదర్శన - Hyderabad lockdown news
సికింద్రాబాద్ జోన్లోని జీహెచ్ఎమ్సీ వర్కర్లకు నెల రోజుల పాటు బట్టర్మిల్క్, బాదమ్పాలు పంపిణీ చేస్తాననిప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రటించారు. ఈసందర్భంగా శానిటేషన్ కార్మికులు "శేఖర్కమ్ములకు కృతజ్ఞతలు" అంటూ ఇంగ్లీష్ అక్షరాలతో రాసిన ప్లకార్డులు చేతపట్టుకొని గాంధీ ఆసుపత్రి ఆవరణలో ప్రదర్శన నిర్వహించారు.

"శేఖర్కమ్ములకు కృతజ్ఞతలు"జీహెచ్ఎమ్సీ సిబ్బంది ప్రదర్శన
ఈసందర్భంగా శానిటేషన్ కార్మికులు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు. "శేఖర్కమ్ములకు కృతజ్ఞతలు" అంటూ ఇంగ్లీష్ అక్షరాలతో రాసిన ప్లకార్డులు చేతపట్టుకొని గాంధీ ఆసుపత్రి ఆవరణలో జీహెచ్ఎమ్సీ సిబ్బంది ప్రదర్శన నిర్వహించారు. ఈ విషయమై స్పందించిన శేఖర్ కమ్ముల లాక్ డౌన్ సమయంలో సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మీకు ఏమీచ్చిన తక్కువే అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 41 కరోనా కేసులు
Last Updated : May 14, 2020, 12:30 PM IST