ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడం బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి మొదటి బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపుగా క్యూ లైన్లన్నీ నిండిపోయి కోలాహలంగా మారింది. మహిళలు ఉదయం నుంచే బోనాలతో ఆలయానికి విచ్చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సంవత్సరం భారీగా వర్షాలు పడి పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు మంత్రి తెలిపారు.
'మెుదటి బోనం సమర్పించిన తలసాని' - 'మెుదటి బోనం సమర్పించిన తలసాని'
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి మెుదటి బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు.
'మెుదటి బోనం సమర్పించిన తలసాని'