మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు బ్రహ్మాండమైన విజయం ఖాయమని జోస్యం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టికెట్లు రాని సభ్యులకు నామినేటెడ్ పోస్టులు, ఇతర అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు.
పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటాం.. - మున్సిపల్ ఎన్నికలపై ధీమా వ్యక్తం చేసిన తలసాని
పురపాలక ఎన్నికల్లో టికెట్లు ఆశించినా.. రాని వారికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు చూపెడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై తలసాని ధీమా
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. పరిపాలన అనేది ప్రజల చెంతకే చేరాలనేది ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: తెరాస ఎమ్మెల్యేలతో రేపు సీఎం కేసీఆర్ సమావేశం