టీజీటీ(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలంటూ టీజీటీ మెరిట్ అభ్యర్థులు.. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. 2017లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన టీజీటీ అర్హత పరీక్షలో తాము మెరిట్ సాధించామని.. 1:1 ఎంపిక ద్వారా తాము ఉద్యోగం కోల్పోయామని అన్నారు. టీజీటీ ఉద్యోగానికి ఎంపికైన వారిలో కొంతమంది వేరే పోటీ పరీక్షలకు అర్హత సాధించారని.. దాని కోసం ఈ ఉద్యోగానికి రాజీనామాలు చేశారని వివరించారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు టీజీటీ అభ్యర్థుల ఆందోళన - తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు టీజీటీ మెరిట్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. టీజీటీలో ఏర్పడ్డ ఖాళీలను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని కమిషన్ను డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు టీజీటీ అభ్యర్థుల ఆందోళన
అలా టీజీటీలో కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయని.. ఆ ఖాళీలను తదుపరి మెరిట్ సాధించిన తమకు కేటాయించాలని పలుమార్లు కమిషన్ను కోరామని తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయకుండా.. నిరుద్యోగులకు మనోవేదన మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కమిషన్ ఈ విషయంలో స్పందించి ఖాళీ పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:ప్రభుత్వరంగ సంస్థల బకాయిలే రూ.200కోట్లు