లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాల్లో జమచేసిన రూ.500 నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉపసంహరించుకుంది. 3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి రూ. 16 కోట్లకు పైగా నగదును బ్యాంకు యాజమాన్యం వెనక్కి తీసుకుంది.
ఖాతాల్లోని సొమ్మును ఉపసంహరించుకున్న టీజీబీ - tgb banks
జన్‌ధన్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమచేసిన రూ.500 నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉపసంహరించుకుంది. సుమారు రూ.16 కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకుంది.
ఖాతాల్లోని సొమ్మును ఉపసంహరించుకున్న టీజీబీ
జన్‌ధన్ ఖాతాల నుంచి నగదు వెనక్కి తెప్పించడం వాస్తవమేనని తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం మహేశ్ పేర్కొన్నారు. 2014 ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారే పీఎంజీకేవైకు అర్హులవుతారని ఆయన తెలిపారు. అంతకు ముందు తెరచిన ఖాతాల్లో పడిన మొత్తాన్ని వెనక్కి తెప్పిస్తున్నామని వెల్లడించారు.