"పసుపుబోర్టు ఏర్పాటుచేస్తే బాగుండేది" - నిజామాబాద్
పసుపు, ఎర్రజొన్న రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రజొన్నకు రూ. 3500, పసుపు పంటకు రూ.15 వేలు మద్దతుధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నదాతల సమస్యలపై పోరాటానికి త్వరలో కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు.
తెజస అధ్యక్షుడు కోదండరాం
వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. రాష్ట్రంలో తక్షణమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతుల వంటావార్పు కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటించారు. ఆర్మూర్ డివిజన్లో 144వ సెక్షన్ ఎత్తివేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.