కస్టడీకి నౌహీరా - సీసీఎస్ పోలీసుల కస్టడీకి నౌహీరా
హీరా గ్రూపు కుంభకోణం కేసులో నిందితురాలైన నౌహీరా షేక్‌ను ఈ రోజు నుంచి సీసీఎస్ పోలీసులు ఐదు రోజుల పాటు విచారించనున్నారు.
సీసీఎస్ పోలీసుల కస్టడీకి నౌహీరా
ఈ కేసులో భాగంగా నౌహీరాను సీసీఎస్ పోలీసులు ఐదు రోజుల పాటు విచారించనున్నారు. నాంపల్లి న్యాయస్థానం కస్టడీకి అనుమతించటంతో చంచల్‌గూడ మహిళా జైలు నుంచి అదుపులోకి తీసుకోనున్నారు. లక్షన్నర మంది హీరా గ్రూప్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 6వేల కోట్ల రూపాయలు వసూలు చేశారని దర్యాప్తులో తేలింది. నిందితురాలిని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 19, 2019, 7:56 AM IST